నందికోట్కూరు: ఉప్పలదడియ'లో గుడ్ ఫ్రైడే వేడుకలు పేద మహిళలకు దుస్తుల పంపిణీ:ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో సిలువ యాత్ర
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు, మండలంలోని ఆర్ సీఎం,సీఎస్ఐ,ఏబీఎం తదితర సంఘాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకల్లో ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్నారు. మండల పరిధిలోని ఉప్పలదడియ ఆర్ సిఎం విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు ఆధ్వర్యంలో ఉప్పలదడియ దేవాలయం నుండి దిగువపాడు గట్టు పైనున్న కల్వరికొండ దేవాలయం వరకు రోడ్డు మార్గాన క్రైస్తవులు నడుచుకుంటూ సిలువను భుజాన వేసుకుని ఏసుక్రీస్తు సిలువపై పడిన 14 స్థలాలను స్మరించుకుంటూ సిలువ యాత్రను చేపట్టారు.చివరగా దిగువపాడు కల్వరికొండ దేవాలయంలో ఫాదర్ మధుబాబు మానవుల కొరకు ఏసుక్రీస్తు సిలువపై పడిన శ్ర