ఒంగోలు అర్బన్: కొరిసపాడు మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజాబాబు, ఉపాధి హామీ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
Ongole Urban, Prakasam | May 30, 2026
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడులో కలెక్టర్ రాజబాబు పల్లెనిద్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. శనివారం వేకువజామునే ప్రజల చెంతకు రాజబాబు చేరుకున్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఉపాధి కార్మికులతో మాట్లాడి వారికి సంబంధించిన పలు అంశాలపై వివరాలు ఆరా తీశారు.