ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో సర్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ కిషోర్, తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని సద్దాం కాలనీ, దొమ్మర కాలనీలో జరుగుతున్న సర్ ప్రక్రియను తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి మున్సిపల్ కమిషనర్ కిషోర్ శుక్రవారం పరిశీలించారు, ఎస్ ఐ ఆర్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ వివరాలను సంబంధిత బిఎల్వోల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఓటర్ జాబితా సమగ్ర సవరణను పారదర్శకంగా చేపట్టాలన్నారు, గడువు నాటికి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు