రాజమండ్రి సిటీ: భారతదేశ నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర కీలకం : రామవరం లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర కీలకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని అనపర్తి మండలం రామవరం లో సోమవారం జరిగిన ఇంజనీర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని ఆయన పిలుపునిచ్చారు.