ఒంగోలు అర్బన్: పేకాట స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు
Ongole Urban, Prakasam | Aug 1, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలపావులూరు గ్రామం శివారులో పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.11500/- నగదు, 4 మొబైల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం చీమకుర్తి పోలీస్ స్టేషన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు