కర్నూలు: రాష్ట్రంలో శ్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుంది : రాయలసీమ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ఎంపీ నాగరాజు
కర్నూలు : రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.మంగళవారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ను ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఆయన పరిశీలించారు. బస్టాండులో లభ్యమవుతున్న సౌకర్యాలు, సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం పై అభిప్రాయాలు సేకరించారు.తరువాత ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మిక్కిలి లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో రోజూ 35 నుంచి 40 వేల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు.ఇకపై తన ఎంపీ నిధుల నుంచి జిల్ల