నంద్యాల అర్బన్: మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్ కు ఏడు రోజుల జైలు శిక్ష: పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 10, 2026
మద్యం తాగి నిర్లక్ష్యంగా స్లీపర్ కోచ్ ట్రావెల్ బస్సు నడిపి ప్రమాదానికి గురిచేసిన వ్యక్తికి కోర్టు 7 రోజుల శిక్ష విధించినట్లు పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల తమ్మలపల్లి ఘాట్లో బస్సును అతివేగంగా నడిపి రోడ్డు పక్కన ఉన్న రైలింగు ఢీకొట్టిన డ్రైవర్ గోపిని పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్షించారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో 7 రోజులు జైలు శిక్ష పడింది.