పుంగనూరు: బండ్లపల్లిలో పెన్షన్ల పంపిణీ చేసి వాట్సప్ గ్రూపులో ఫొటో అప్‌లోడ్ చేశారని ఘర్షణ, టీడీపీ నాయకునికి గాయాలు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రబ్ధిదారులకు మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు చిన్న రెడ్డప్ప పంపిణీ చేసి వాట్సాప్ గ్రూపులలో ఫోటోలు అప్లోడ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు అప్లోడ్ చేశారని గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్న రెడ్డప్ప అతని కుటుంబ సభ్యులపై దాడి పాల్పడ్డారు. దాడిలో రెడ్డప్ప అతని కుమారుడు గాయపడ్డారు .ఘటన స్థలానికి సిఐ సుబ్బారాయుడు , పోలీస్ సిబ్బంది చేరుకున్నారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.