ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ సమీపంలో ఆటో బోల్తా పడి మహిళకు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ సమీపంలో ఆటో బోల్తా పడి వెంకట లక్ష్మమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి, పెద్దయమ్మునూరు గ్రామం నుంచి తన కూతురిని సంజామలకు ఆటోలో తీసుకుని వెళుతుండగా స్థానిక మారెమ్మ గుడి వద్ద రహదారిపై ఉన్న వడ్లను తప్పించబోయి ఆటో పొలాల్లోకి దూసుకుని వెళ్లి బోల్తాపడడంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన మహిళ లక్ష్మీదేవిని ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.