ఒంగోలు అర్బన్: 16,17 తేదీలలో పొగాకు రైతు దీక్ష కార్యక్రమం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jul 14, 2026
పోగాకు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అని వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 16 న కనిగిరి, 17 న ఒంగోలు లో "పోగాకు రైతు దీక్ష " కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలు పార్టీ ఆఫీస్ లో విలేకర్ల సమావేశం లో పోగాకు రైతు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగొచరంగ వుంది అని పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కనీషం కూలీలకు డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వుంది అన్నారు.