ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 163 అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు గ్రామంలో పూర్తి చేయకపోవడంతో వాటిని గమనించని వాహనదారులు డివైడర్లను ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. నేడు శనివారం రోజున ఉదయం 8 గంటలకు డివైడర్ పై నుంచి ఓ లారీ వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డివైడర్ ధ్వంసమైంది.