ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీలో రంగస్వామి, భాస్కర్ అనే యువకులపై కుక్కలు దాడి చేశాయి
ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీలో రంగస్వామి, భాస్కర్ అనే యువకులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ఎమ్మిగనూరులో కుక్కల దాడులు పెరుగుతున్నాయని, అధికారులు కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు.