పొన్నూరు: వెల్లలూరులో ఐదేళ్ల బాలుడుపై కుక్కల దాడి, చికిత్స పొందుతూ కార్తీక్ మృతి
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరులో విషాదం చోటుచేసుకుంది. తాడిశెట్టి కార్తీక్ గత నెల 22న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించినా సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.