కోడుమూరు: కోడుమూరులో కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా
కోడుమూరు కోట్ల సర్కిల్లో సోమవారం ఏటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆయా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసేందుకు తీసుకువచ్చిన లేబర్ కోడులు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టని విమర్శించారు. రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.