ఆత్మకూరు: పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే మృతి, ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారును రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చి ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుకున్నారు.