ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.7,350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పొన్నలూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు.