పలమనేరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై వైసీపి శ్రేణులు నిరసన ర్యాలీ, ఆర్డీవో ఏవో కు వినతి పత్రం అందజేత
పలమనేరు: వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సిల్క్ ఫారం వద్ద నుండి రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ పలమనేరు నియోజకవర్గం 5 మండలాల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం చేరుకున్నారు. ఆర్డీవో కార్యాలయం లోపలికి పరిమిత సంఖ్యలో వెళ్లాల్సిందిగా పోలీసులు తెలపగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.