ఒంగోలు అర్బన్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో చర్చి ఎన్నికలు
Ongole Urban, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక జోవియేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నందు శుక్రవారం హైకోర్టు తీర్పుతో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొదటినుండి చర్చి ఆదిపత్యం విషయంలో కెనడీ మరియు అగస్టీన్ వర్గాల మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి ఈ గొడవల నేపథ్యంలో ఆదివారం ప్రార్థన చేసేటువంటి విషయంలో పలుమార్లు గొడవలు జరగటం పోలీసులు భారీ బందోబస్తు రావటం అనవాయితీగా మారింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం రోజు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ ఎన్నికలను నిర్వహించారు ఈ ఎన్నికల ప్రక్రియ ఉదయం ప్రారంభం అయ్యింది