నంద్యాల అర్బన్: నంద్యాలలో పెట్రోల్ కోసం బార్లుతీరిన ప్రజలు
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
గ్యాస్ ఇబ్బందుల నుంచి కోలుకోకముందే ప్రజలకు పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. బంకుల్లో నిల్వలు లేవనే వార్తలు రావడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు. వాహనదారులు క్యాన్లతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోవడమే ఈ కొరతకు ప్రధాన కారణమని యజమానులు చెబుతున్నారు. పెట్రోల్ దొరక్క ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.