కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని కేంద్రం తక్షణమే మానుకోవాలని,కార్మికుల, రైతుల హక్కులు కాపాడాలని కార్మిక , రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బండి నాగేశ్వరరావు అన్నారు.. శనివారం పాల్వంచ సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.