పలమనేరు: ఘనంగా వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పలమనేరు: పట్టణంలోని రంగాపురం క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని స్వామి వారిని వేడుకున్నారు. ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని, ఆ వినాయకుని కృప ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఆయన్ను గౌరవ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.