శంకరపట్నం: మొలంగూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా, సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్
మిల్ మేకర్ వాహనం బోల్తా.. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్.. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. వరంగల్ ప్రధాన రహదారి కావడంతో ఆ రహదారికుండా వాహనాలు ఓవర్ స్పీడ్ గా వెళ్తుంటాయి. ఈ క్రమంలో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొని చాలామంది మృత్యువాత పడ్డ సంఘటనలు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం మొలంగూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఓ బొలేరో వాహనం బోల్తా పడింది. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి నుంచి వరంగల్ కు మిల్ మేకర్ లోడ్‌ను తీసుకెళ్తున్న క్రమంలో హైవేపై వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో