ఒంగోలు అర్బన్: ఒంగోలులో మహిళా ఉద్యోగి దారుణ హత్య, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు
Ongole Urban, Prakasam | May 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణ హత్యకు గురైన అంధురాలు ఇరిగేషన్ శాఖ అటెండర్ ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గురువారం వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ అన్నారు. వెంకటరమణ అనే వ్యక్తితో లాడ్జిలో ఆదిలక్ష్మి బస చేసినట్లు పోలీసులు గుర్తించారు.