పాలకొల్లు: దగ్గులూరు గ్రామంలో మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించిన సిపిఎం బృందం
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటుపరం అంటే విద్యను వ్యాపారం చెయ్యడమేనని, ప్రభుత్వమే వైద్య కళాశాలను నడపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ డిమాండ్ చేశారు. దగ్గులూరు గ్రామంలో మెడికల్ కాలేజీ స్థలాన్ని మంగళవారం సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మీడియాతో మాట్లాడుతూ దగ్గులూరు గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో 60 ఎకరాల భూమిని సేకరించారని గుర్తుచేశారు. ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తిచేసి, ఫౌండేషన్ ప్రాధమిక స్థాయిలో ఉందన్నారు.