మిడ్జిల్: మిడ్జిల్ తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుల నిరసన
కొత్తపల్లి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న మిడ్జిల్ తహశీల్దారు వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం తహశీల్దార్ ఆఫీస్ ముందు వారు నిరసన తెలిపారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడారు. కెనాల్లో మొరం, ఇసుక, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న మాఫియాకు తహశీల్దార్ అండగా ఉంటూ ఫేక్ పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు.