రాప్తాడు: రాప్తాడు లో దళిత రణభేరి కరపత్రాలను ఆవిష్కరించిన బహుజన సమాజ్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ కుళ్లాయప్ప
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ తోపుదుర్తి అంకె కుళ్లాయప్ప అంబేద్కర్ విగ్రహం వద్ద విజయవాడలో నిర్వహించే దళితుల రణభేరి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజవాది పార్టీ కుళ్లాయప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని దళితులకు మోసం చేస్తున్నారని ఇటువంటి సందర్భంలో దళితుల రణభేరి నిర్వహించి దళితుల సమస్యలపై పోరాటానికి విజయవాడలో నిర్వహించే సభకు దళితులంతా తరలిరావాలని రాప్తాడు నియోజవర్గం సమాజ్ పార్టీ ఇన్చార్జ్ అంకే కులాయప్ప పిలుపునిచ్చారు.