అదిలాబాద్ అర్బన్: ఇచ్చోడ మండలం ముఖరా (బి) గ్రామ శివారులో పత్తి చెనులో పిడుగు పడి మడిపోయిన పత్తి పంట మొక్కలు
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న ఏకధాటి వర్షాలతో అటు ప్రజలు, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే తీవ్రంగా పంట నష్టం జరగగా, రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా గురువారం ఇచ్చోడ మండలం ముఖరా (బి) గ్రామ శివారులో పత్తి చెనులో పిడుగు పడింది. రైతు లాండీగా నవనాథ్ సాగు చేస్తున్నా 8 ఎకరల పత్తి పంట పొలాల్లో పిడుగు పడింది. దీంతో చేనులోని సుమారు 200కు పైగా పత్తి మెుక్కల మాడిపోయాయి. అసలే భారీ వర్షాలతో పంట నష్టపోగా, ఈ పిడుగుపాటు మరింత నష్టాన్ని చేకూర్చిందని రైతు వాపోయాడు.