చిందాడ గరువు,కామన గరువు గ్రమాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపనలు,ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్#@
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి గడప గడపకు మన ప్రభుత్వం ఇతర పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తూ గ్రామాలు ప్రగతి పథంలో పయనించే విధంగా సియం జగన్మోహన్ రెడ్డి పాటు పడుతు న్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిలిపే విశ్వరూప్ పేర్కొన్నారు. సోమవారం అమలాపురం మండల పరిధిలోని చిందాడ గరువు ,కామన గరువు పలు అభివృద్ది పనులకు శంకుస్దాపనలు,ప్రారంభోత్సవాలు చేసారు... వీటిలో భాగంగా కమనగరువులో కోటి రూ.ల వ్యయంతో బీటీ రోడ్డును మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు.