డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి రూ.35,97,311 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. 16 నెలల్లో మొత్తం 543 మందికి రూ.5,11,99,337 ఆర్థిక సాయం మంజూరైందని ఆయన తెలిపారు. ఆరోగ్య చికిత్సలు, ప్రమాదాల నుంచి కోలుకోవడానికి ఈ సాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.