డోన్: డోన్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో కీలక ముందడుగు
Dhone, Nandyal | Jun 16, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. డోన్ కొండపై ఏర్పాటు చేసిన 630 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ యార్డ్, 1200 కిలోలీటర్ల క్లియర్ వాటర్ పంప్ హౌస్కు విద్యుత్ సరఫరాను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. డోన్ పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.