అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలి:రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 04వ కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతిలో జరుగుతున్న నాలుగవ కలెక్టర్ల సదస్సులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అన్నమయ్య జిల్లాలో వ్యవసాయ ఆధారిత రైతుల ఎక్కువగా ఉన్నారని వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం సాగు తక్కువగా ఉందన్నారు.