నంద్యాల అర్బన్: నంద్యాలలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
Nandyal Urban, Nandyal | May 4, 2026
నంద్యాల పొన్నాపురం కాల్వ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై కుమారి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. ధర్మవరం వెళ్లే రైలు కింద పడి సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.