బనగానపల్లె: 15 ఏళ్ల తర్వాత సంజామల మండలంలో పెద్దమ్మ తల్లి జాతర
15 ఏళ్ల తర్వాత సంజామల మండలం ఆకుమల్లలో గ్రామ దేవతల మహా జాతర ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి చౌడేశ్వరి దేవి జ్యోతులు, శనివారం పెద్దమ్మ తల్లి ఉత్సవం, ఆదివారం బోనాలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతర కావడంతో గ్రామంలో ప్రతీ ఇంట పండుగ వాతావరణం సంతరించుకుంది.