కర్నూలు: ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ కు నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సిరి
ముచ్చుమర్రి నుండి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ కు నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఓర్వకల్ మండలం గుట్టపాడు గ్రామ సమీపంలో ఉన్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ వివరాలను యాజమాన్యం, అధికారులను అడిగి తెలుసుకున్నారు.. స్థానికంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారని కలెక్టర్ జై రాజ్ ఇస్పత్ యాజమాన్యం తో ఆరా తీశారు. సిఎస్సార్ నిధుల కింద నంద్యాల చెక్ పోస్ట్ వద్ద నిర్మిస్తున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర