అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ నేత చాంద్ బాషా , శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మెడికల్ కాలేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నిరూపించాలని కోరారు. ఆరోపణలు నిరూపించకపోతే బహిరంగంగా పెద్దిరెడ్డి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వైయస్సార్ పార్టీ మైనారిటీ నేత చాంద్ భాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.