కనిగిరి: పరిశుభ్రత ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: పరిశుభ్రత ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. మంగళవారం కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పరిశుభ్రత ద్వారా ఆరోగ్యకరమైన సమాజం అనే అంశంపై స్థానికులకు మున్సిపల్ చైర్మన్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పరిసర ప్రాంతాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులకు ప్రబలకుండా చూసుకోవచ్చు అన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఎన్నో రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని హెచ్చరించారు.