ధర్మవరం రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సత్య కుమార్.
ధర్మవరం నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే & వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గుడ్ న్యూస్ చెప్పారు. నియోజకవర్గంలోని రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఉద్యానవన శాఖ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఫారం ఫాండ్స్, ప్యాకప్ హౌస్ లకు రైతు సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వీటి వలన రైతులకు ఎంత ప్రయోజనం అన్నారు. ప్రభుత్వం సైతం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని నవంబర్ 5వ తారీఖు లోపల రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.