ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన సీనియర్ అసిస్టెంట్ కు ఘనంగా సన్మానం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందిన పి రాముడు కు బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు, తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి, వీఆర్వోలు వీఆర్ఏలు కార్యాలయం సిబ్బంది ఆయనను శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు, ప్రభుత్వ సేవలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజా సేవలను కొనియాడారు పదవి విరమణ అనంతరం జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.