బనగానపల్లె: బనగానపల్లెలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు, పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు – 2026 కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, అవుకు, కోవెలకుంట్ల మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.