తెగిన కానుగులగుంట చెరువు గట్టు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట గ్రామ సమీపంలో కానుగులగుంట చెరువు గట్టు మంగళవారం తెగిపోవడంతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వృధాగా పోతున్నది. స్థానికులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం తెలిపారు. కానుగులగుంట గట్టు తెగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు చేరుకుని హుటాహుటిన తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.