వెంకటాపురం: ములుగు జిల్లాలో రెండవ ANM ల ముందస్తు అరెస్ట్
ములుగు జిల్లాలో ఏఎన్ఎంల ముందస్తు అరెస్టు. ములుగు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన రెండవ ఏఎన్ఎంలను పోలీసులు నేడు మంగళవారం రోజున ఉదయం ముందస్తుగా అరెస్టు చేశారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా.. తాము ఎన్సీడీ వివరాలను ఇన్నిరోజులు ఆఫ్ లైన్లో చేశామని, ఆన్లైన్లో కూడా చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఏఎన్ఎంలు వాపోయారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.