అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం గొర్లముదివీడు క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కలకడ మండలం కదిరయాన్ చెరువు గ్రామానికి చెందిన రెడ్డప్ప (60) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాయచోటి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.