తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, కారు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి. మల్లవరం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తాళ్లరేవుకు చెందిన కోట లోవరాజు కాలుకు తీవ్రగాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని 108 అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.