డోన్: బనగానపల్లెలో 36 అడ్మిషన్లతో తెలుగుపేట పాఠశాల ఆదర్శం
Dhone, Nandyal | Jun 12, 2026 బనగానపల్లెలోని తెలుగుపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మనబడి-మన పండుగ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాధికారి స్వరూప పాల్గొని కొత్తగా చేరిన విద్యార్థులకు గులాబీ పూలతో స్వాగతం పలికారు. మండలంలోనే అత్య ధికంగా 36 మంది ఒకటో తరగతి విద్యార్థుల చేరికలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. విద్యార్థులకు టెస్ట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో HM ప్రతాప్, ఎస్ఎంసీ ఛైర్ పర్సన్ మాధవి ఉన్నారు.