డోన్: రంగాపురంలో కుంటను తలపిస్తున్న మురుగునీరు
Dhone, Nandyal | Apr 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురంలోని న్యూ బిల్డింగ్ కాలనీలో మురుగునీరు నిలిచి చిన్న పాటి కుంటను తలపిస్తోంది. ప్రధానంగా గ్రామంలో నిర్మించిన నూతన జాతీయ రహదారి ఎత్తు కావడం, కాలనీలోని మురుగునీరు వెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మురుగునీరు నిలిచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు మురుగునీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.