నంద్యాల అర్బన్: జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్
Nandyal Urban, Nandyal | Apr 15, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ ను బలోపితం చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి వాహనదారులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించారు.