తిరుపతి జిల్లా, బాలయపల్లి మండలం, చుట్టి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల. సుబ్బమ్మ (65) అనే మహిళ పీడ గిన్నెను కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుబ్బమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.