డోన్: బేతంచర్ల లో పాముకాటుతో మహిళ మృతి
Dhone, Nandyal | Jul 4, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మాధవి (40) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిందని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి పశువులకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో ఆమెకు పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.