ఒంగోలు అర్బన్: ఒంగోలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలుడు ఆనంద్ గుంటూరులో క్వారీ గుంతలో పడి మృతి
Ongole Urban, Prakasam | May 27, 2026
గుంటూరు రూరల్ మండలంలోని నాయుడుపేటలో విషాదం చోటుచేసుకుంది. మైనింగ్ క్వారీ గుంతలో పడి ఆనంద్ (6) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒంగోలుకు చెందిన ఓ కుటుంబం నాయుడుపేటలో బంధువుల పుట్టినరోజు వేడుకకు వచ్చింది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 70 అడుగుల లోతు క్వారీ గుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.