ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్వాక్రా మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బుధవారం డ్వాక్రా మహిళలకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు ఖాతా నంబరు లేదా ఓటీపీ నెంబర్ అడిగితే చెప్పరాదని తెలిపారు. అంతేకాకుండా అపరిచిత వ్యక్తులు ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అలానే సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు డ్వాక్రా మహిళలకు విజ్ఞప్తి చేశారు. బహుమతులు గెలుచుకుంటున్నారని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.